10 April, 2026 | 8:54 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలం   •   ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •  

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

10-04-2026 06:49 PM

ప్రోటోకాల్ పాటించకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఎంపిక

కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వారిపై తగు చర్యలు తీసుకొని అర్హులైన పేదలకు న్యాయం చేయాలి అంటూ బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్  కు ఫిర్యాదు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  ఇల్లు లేని పేదల కోసం కట్టిన డబుల్ బెడ్ రూమ్ పంపకంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ,కార్యకర్తలు సూచించిన వారికి మాత్రమే మంజూరు చేస్తున్నారని వారు ఆరోపించారు.

ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రతి వార్డు నుండి 12 మంది అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ చొప్పున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, నాయకులకు,  కార్యకర్తలకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుల్లో సైతం తమను కాదని కనీస ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపిక చేస్తున్నారని విమర్శించారు.

తాండూర్ తాసిల్దారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అర్హులైన పేద ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు  యర్షాద్, జావిద్ ,సురేష్, యోగానంద్, నాయకుల రుద్ర పాటిల్, సంతోష్ గౌడ్, ఎజాజ్, అనంతరెడ్డి, సంతోష్ తదితరులు ఉన్నారు.