వడదెబ్బకు వ్యక్తి మృతి
10-04-2026 06:42 PM
అనాధలైన ముగ్గురు పిల్లలు
నవభారతలో విషాదఛాయలు
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవ భారతి ఏరియా కు చెందిన భానోత్ బద్రు (57) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే బద్రు గత మూడు రోజులుగా కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతాల్లో సిమెంట్ పనులు చేస్తూ తీవ్ర ఎండలకు వాంతులు, విరోచనాలకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృత్యువాత పడ్డాడు. కుటుంబానికి పెద్దది ఎక్కువగా ఉన్న బద్రు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.




