7 April, 2026 | 4:02 AM

గోరక్ష చట్టాలను కఠినంగా అమలుచేయాలి

07-04-2026 02:17 AM

సీఎస్ రామకృష్ణారావుకు వీహెచ్‌పీ బృందం విజ్ఞప్తి

గో రక్షణకు కృషి చేస్తానని సీఎస్ హామీ

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ రామకృష్ణారావును వీహెచ్‌పీ ప్రతినిధులు కోరారు. సోమవా రం సచివాలయంలో రామకృష్ణారావు ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నాయకులు మా ట్లాడు తూ.. గోమాత భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయ ఆధారిత జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు.

గోవు కేవలం ఒక జంతు వు మాత్రమే కాకుండా, భారతీయ జీవన తత్త్వంలో పూజనీయ స్థానం కలిగిన పవి త్ర ఆరాధ్యరూపం అని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పలుచోట్ల గోవుల అక్రమ రవాణా, అక్రమ వధ, చట్టవిరుద్ధ మాంస రవాణా వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గోర క్షణ అనేది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాకుండా, సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ, వ్యవసాయ పరిరక్షణకు సం బంధించిన జాతీయ బాధ్యత అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గోమాత సంరక్ష ణ విషయంలో మరింత చురుకైన, కఠినమైన చర్యలు తీసుకుని, చట్ట ఉల్లంఘన లకు పాల్పడే వారిపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని డిమాండ్‌చేశారు. సానుకూ లంగా స్పందించిన సీఎస్ గోహత్య నిషేధ చట్టాలను కఠినంగా అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని నాయకులు తెలిపా రు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు పగుడాకుల బాలస్వామి, రమేష్, సుభాష్ చందర్, స్వామీజీలు దుర్గానంద, సర్వేశ్వర శివయోగి అంబిక, రంగనాథ్ పాల్గొన్నారు.

గోరక్షణపై వీహెచ్‌పీ డిమాండ్లు

గోరక్షణ చట్టాల అమలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించాలి. సరిహద్దు ప్రాంతాలు, హైవేలు, చెక్‌పోస్టుల వద్ద కఠిన తనిఖీలు చేపట్టాలి. అక్రమ వధశాలలు, అనుమతిలేని మాం స రవాణా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. గోవధ, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన శిక్షలు అమలుచేయాలి. గోశాలలకు ప్రభుత్వ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం అందించాలి. గోరక్షణపై పోలీసు, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖల సమన్వయం పెంచాలి.