1 July, 2026 | 1:53 AM

ఏచర్ల ముత్యాలమ్మ హుండీ లెక్కింపు

01-07-2026 12:00 AM

మూడు నెలల్లో రూ.44,755 ఆదాయం

చివ్వెంల, జూన్ 30 : మండలంలోని వల్లభపురం గ్రామం వద్ద కొలువై ఉన్న ఏచర్ల ముత్యాలమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెలల వరకు భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా హుండీ ద్వారా రూ.44,755 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి, ఆలయ ఈఓ సత్యనారాయణ, సర్పంచ్ బాణోత్ వీరేశ్, ఆర్‌ఐ శ్రీను, కార్యదర్శి మధు, జీపీఓ వెంకన్న, కానిస్టేబుల్ సురేష్, మాజీ సర్పంచ్ మొగుదాల లక్ష్మణ్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు గోనెల లక్ష్మయ్య, బైరు రవీందర్, నారాయణ  ఆలయ సిబ్బంది శేఖర్, శ్రీశైలంలు పాల్గొన్నారు.