27 August, 2026 | 8:45 AM

2028లో సామాజిక మార్పు ఖాయం

27-08-2026 02:40 AM

సర్జికల్ స్ట్రైక్-59తో రెడ్లు, వెలమలకు చెక్ 

టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-59 రాజకీయ ఆపరేషన్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. రా ష్ట్రంలోని 59 నియోజకవర్గాల్లో రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంపై గణాంక ఆధారిత విశ్లేషణ చేపట్టిన టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(TRP chief and MLC Teenmar Mallanna)  వరంగల్ వెస్ట్, పరకాల, పాలేరు నియోజకవర్గా ల ఓటర్ల వివరాలను అధికారిక లెక్కలతో ప్రజల ముందుంచారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల చేతుల్లోనే రాజ్యాధికారం ఉండాలి. బీసీలు ఓట్ల రూపంలో మెజారిటీగా ఉన్నప్పటికీ అధికారంలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ అసమానతలను ప్రజలకు తెలియజేయడమే సర్జికల్ స్ట్రైక్-59 లక్ష్యం అని మల్లన్న పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని వరంగల్ వెస్ట్ నియో జకవర్గంలో రెడ్డి ఓటర్లతో పోలిస్తే  బీసీ ఓటర్లు పదకొండు రెట్లు ఎక్కువగా ఉన్నారని వివరించారు.

ఈ నియోజకవర్గంలో డాక్టర్ అభినవ్ భాస్కర్, దాస్యం వినయ్ భాస్కర్, ప్రొఫెసర్ తిరునహరి శేషు, సంగం రెడ్డి పృథ్విరాజు, రావుల కిషన్, జక్కుల రవీందర్ వంటి బలమైన బీసీ నాయకత్వం అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే పరకాల నియోజకవర్గ రాజకీయాలను బీసీ వర్గాలే నిర్ణయించే స్థితిలో ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు.

గతంలో ములుగూరు భిక్షపతి వంటి బీసీ నేతలు విజయాలు సాధించారని గుర్తుచేస్తూ, మాజీ ఎమ్మెల్యే ములుగూరు భిక్షప తి, పల్లబోయిన అశోక్ ముదిరాజ్, డాక్టర్ కాళీ ప్రసాద్, కొండా సుష్మిత, పూజారి సత్యనారాయ ణ, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, నాగుర్ల వెంకటేశ్వరులు, హవేలి దామోదర్ వంటి నాయకులు ప్రజా బలం కలిగిన బీసీ నేతలని తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు నియోజకవర్గంలో బీసీల మద్దతు లేకుండా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలవలేరని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

ఈ నియోజకవర్గంలో వెన్నబోయిన రమేష్ యాదవ్, పాశబోయిన వీరన్న ముదిరాజ్, పత్తి నాగేశ్వరరావు, వెన్నపూసల సీతారా ములు యాదవ్, బొల్లికొండ శరత్ గౌడ్, గూ డూరు ఉపేందర్, శీలం వెంకట లక్ష్మి, మామిడి వెంకన్న, ఎంకి జానకి రామయ్య యాదవ్, పాగ ర్తి సుధాకర్ వంటి బలమైన బీసీ నాయకులు ఉన్నారని తెలిపారు. 2028 ఎన్నికల్లో సామాజిక మార్పు ఖాయం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మై నార్టీలు కలిసి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ని ర్మించాల్సిన అవసరం ఉంది అని మలన్న పిలుపునిచ్చారు.

నేడు భవనగిరిలో జెంజి యువతతో ప్రత్యేక సమావేశం

యువతలో చైతన్యం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న జెన్ జెడ్ అడ్డా విత్ మల్లన్న కార్యక్రమంలో టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో యువతతో ముఖాముఖి సంభాషణ, వారి సందేహాలకు సమాధానాలు, భవిష్యత్ అవకాశాలపై మార్గనిర్దేశం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు