1 July, 2026 | 2:49 AM

స్వామినాథన్ సేవలు ఎనలేనివి

01-07-2026 12:00 AM

ఉద్యోగుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు

టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎమ్ హుస్సేని

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సం ఘం పూర్వ అధ్యక్షుడు స్వర్గీయ ఎమ్. స్వామినాథం సంస్మరణ సభ మంగళవారం హైద రాబాద్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి కూరాడి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సభ కు టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యద ర్శి డాక్టర్ ఎస్‌ఎమ్ హుస్సేని (ముజీబ్) ముఖ్య అతిథిగా హాజరై స్వామినాథం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హుస్సేని మాట్లాడుతూ స్వామినాథం ఉద్యోగుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేసిన అసాధారణ నాయకుడని కొనియాడారు.

టీఎన్జీవోస్ యూనియన్‌ను బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు, యూని యన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉం డాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి కూరాడి శ్రీనివాస్ మాట్లాడుతూ నాన్-గెజిటెడ్ అధికారుల హక్కుల పరిరక్షణ కోసం స్వామినాథం చూపిన బాట నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.

ఆయన ఆశయాల సాధన కోసం హైదరాబాద్ జిల్లా యూనియన్ ఎల్లప్పుడూ ముం దుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ నగర అధ్య క్షుడు కె. శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కేఆర్ రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి జి. గీత, కార్యవర్గ సభ్యులు ముఖీం ఖురేషి, ఏవీ శ్రీధర్, మహ్మద్ వాహిద్, మహ్మద్ ముస్తఫా, వివిధ యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, భారీ సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని స్వామినాథం ఉద్యోగ లోకానికి చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు.