స్కిల్లింగ్ ఎకోసిస్టం బలోపేతానికి కృషి
- స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కలిసి రండి
- పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి) : తెలంగాణను స్కిల్ క్యాపిటల్(Skilling Capital)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తల(Entrepreneurs)కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికత(Technology)కు అనుగుణంగా పరిశ్రమల(Industries)కు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్‌ఎల్‌ఎఫ్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్‌కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు.
ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్ ఎకోసిస్టంను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకుంటూ భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు.
తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్‌లో బుధవారం మీసేవా డిజిటల్ మార్కె టింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. వీరికి ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లు’ గా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మీసేవా ద్వారా నేరు గా డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా ర్టల్:meeseva.telangana.gov.in, టోల్‌ఫ్రీ నంబర్లు: 1100/1800-425-1110 కొత్త సదుపాయాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.






