ఏబీఎన్ రాధాకృష్ణా.. బీ కేర్‌ఫుల్!
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరిక
- ఆంధ్రా మీడియాను హెచ్చరిస్తున్న.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి
- నా ప్రతాపమే చూపిస్తే ఛానెల్, పేపర్ ఇక్కడ ఉండవు
- మాకు 100 ఛానెళ్లు పెట్టే దమ్ము, ధైర్యం ఉంది
- మీడియా ముసుగులో నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు
- మీ సర్టిఫికెట్‌లు నాకు అవసరం లేదు
- ఏబీఎన్ మీడియా ఎవరికి సపోర్ట్ చేస్తున్నదో అందరికీ తెలుసు
- తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడిన ఉద్యమకారులం
- ఎన్నికల ముందు వచ్చినవారికి టికెట్లు ఇవ్వడంతో
- నిజమైన కార్యకర్తలకు నష్టం జరుగుతున్నది
- సీఎంపై నేనెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు
* మీడియా ముసుగులో తెలంగాణలోని మాలాంటి నాయకుల వ్యక్తిత్వాన్ని కించపర్చడం, బలహీనపర్చే విధంగా ఆంధ్రా మీడియా ఛానెళ్లు వ్యవహారిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్రంలో ఆంధ్రా మీ డియా పెత్తనం ఎక్కువైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మీడియా ఎక్కడుంది? ఎవరికి సపోర్ట్ చేశారో ప్రజలందరికీ బాగా తెలుసు. నిఖార్సైన తెలంగాణ నేతలను ఆంధ్రా మీడియా అడ్డుకో లేదు.
* తెలంగాణలో ప్రతిపక్షమే లేకుం డా చేయాలనుకున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా సర్వస్వం ధారసోసి కొట్లాడిన వ్యక్తిని. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మాకు ఆంధ్రా మీడియా అవసరం లేదు. ఎంపీగా నేను పార్లమెంట్‌లో కొట్లాడినట్లు.. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ కొట్లాడలేదు.. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేనివాళ్లు నాపై విమర్శలు చేస్తున్నారు. వారి స్థాయి ఏమిటో ఓసారి వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలి.
- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 2౬ (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆంధ్రా మీడియా(Andhra Media)పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంతర్గత విషయాలపై, నాపై వ్యక్తిగతంగా ఏబీఎన్ ఛానెల్(ABN channel) దుష్ప్రచారం చేస్తు న్నది. ఆంధ్రా మీడియా(Andhra Media)ను హెచ్చరిస్తు న్నా.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే మర్యాద ఉండదు’ అని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఒకవేళ నా ప్రతాపమే చూపిస్తే ఆ ఛానెల్, పేపరే ఉండవు’ అని ఏబీఎన్ రాధాకృష్ణ(ABN Radhakrishna)పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం కొట్లాడిన తమలాంటి వాళ్లకు ఆంధ్రా మీడియా ఛానళ్ల సర్టిఫికెట్‌లు అవసరం లేదన్నారు. ‘మీడియా ముసుగులో మా వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా, క్యారెక్టర్లను దెబ్బతీసేలా ఆంధ్రా పత్రికలు, న్యూస్ ఛానెళ్లు వార్తలు రాస్తే మర్యాదగా ఉండదు’ అన్నారు. బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో భేటీ అయిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏబీఎన్ ఛానెల్ ఎవరికి సపోర్టు చేస్తున్నదో అందరికీ తెలుసునన్నారు.
‘ఒళ్లు దగ్గరపెట్టుకుని జాగ్ర త్తగా ఉంటే మంచిది. లేకపోతే మర్యాద దక్కదు. ఇక్కడ ఏబీఎన్ ఛానెల్ ఉండదు, ఆ పేపర్ ఉండదు’ అని చెప్పారు. తమది కాంగ్రెస్ కుటుంబమని తెలిపారు. ‘తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజా యితీపరులు ఎందరో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంతమాత్రాన నిజాయితీగా ఉండి పార్లమెంట్‌లో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులం.
జర్నలిస్టులంటే గౌరవం ఉంది. మీడియా ము సుగులో తెలంగాణలోని మాలాంటి నా యకుల వ్యక్తిత్వాన్ని కించపర్చడం, బలహీనపర్చే విధంగా ఆంధ్రా మీడియా ఛానెళ్లు వ్యవహారిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ హెచ్చరిక అందరికీ కాదు కొందరికే’ నని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మీడియా ఎక్కడుంది?, ఎవరికి సపోర్ట్ చేశారో ప్రజలందరికి బాగా తెలుసు. నిఖార్సైన తెలంగాణ నేతలను ఆంధ్రా మీడియా అడ్డుకోలేదు’ అని మండిపడ్డారు.
ఏబీఏన్ ఛానెల్ తనను బలహీపనపర్చాలనే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలాంటి ఛానెళ్లు, పేపర్లు ఒకటి కాదు, 100 పెట్టే దమ్ము, ధైర్యం తమకు ఉందన్నారు. ఆంధ్రా మీడియాపై తాము ఆధారపడి లేమని తెలిపారు. ‘కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మాకు ఆంధ్రామీడియా అవసరం లేదు. ఎంపీగా నేను పార్లమెంట్‌లో కొట్లాడినట్లు.. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ కొట్లాడలేదు..’ రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మీడియా జర్నలిస్టులు అంటే తనకు ఆపారమైన గౌరవం ఉందని, కానీ, మీడియా ముసుగులో వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్న, కొందరు వ్యక్తులకు కొమ్ముకాస్తున్న మీడియాకే వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గ నిధుల కోసమే..
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కోసమే భట్టిని కలిసినట్లు చెప్పారు. ‘నేను ఎప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిపైన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం అనాడు ఫైట్ చేశాను. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్లు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. నాపై విమర్శలు చేసే వాళ్ల స్థాయి ఏంటో ఓసారి వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో నేను ఒక్కడిని. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాను.
2018 ఎన్నికల్లో పెద్ద లీడర్లు ఓటమిపాలైనా.. మునుగోడు ప్రజలను నన్ను గెలిపించారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా సర్వస్వం దారసోసి కొట్లాడిన వ్యక్తిని. రాజగోపాల్‌రెడ్డి అనునిత్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే కాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేవ్యక్తి’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, వారు గెలిచిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతున్నదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధిష్ఠానంపై ఉందని చెప్పానని ఆయన పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నారు. తాను ఎప్పుడైనా పార్టీ బలోపేతం కోసమే మాట్లాడాను తప్ప, పార్టీని బలహీనపర్చే విధంగా ఎప్పుడు మాట్లాడనని తెలిపారు. తెలంగాణలో నిజమైన, నిజాయితీపరులైన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నతస్థాయి పదవుల్లో ఉండొచ్చు.. అంత మాత్రాన నిజాయితీగా ఉద్యమంలో పని చేసిన వారిని కింపరచ్చేలా కథనాలు రాయడం సరికాదన్నారు.
వారిపై అధిష్ఠ్ఠానం నిర్ణయమే ఫైనల్..
కొండా సుష్మిత, చిన్నారెడ్డి అంశాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్పారని, ఈ అంశంలో సీఎం మాటే నామాట అని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉందని, కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ లోతైన అధ్యయనం చేసి పీసీసీకి నివేదిక ఇచ్చిందని, ఈ విషయంలో అధిష్ఠ్ఠానం నిర్ణయాన్ని ఎవరు కాదనలేమన్నారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై భట్టి విక్రమార్కతో చర్చించేందుకు తను వచ్చాననే వార్తలు వాస్తవం కాదన్నారు.






