04-02-2026 01:56:45 AM
సుల్తానాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ లం నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు నిర్వహించారు, వివిధ రకాలుగా మొత్తం 21 లక్షల 988 రూపాయ ల ఆదాయం వచ్చింది, మానేటి రంగనాయక స్వామి దేవాలయంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, జాతర కమిటీ డైరెక్టర్లు నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్ , కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి, ఆలయ ఈవో శంకరయ్య, ప్రవీణ్ రెడ్డి , మహిళలు పాల్గొన్నారు, వీటితో పాటు ఒక గ్రామ్ 700 ల మిల్లి గ్రాముల బంగారం, 375 గ్రాముల మిశ్రమ వెండి కానుకలు వ చ్చాయని తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో సుల్తానాబాద్ కు చెందిన రాజరాజేశ్వరి సేవా సంస్థ కో...ఆర్డినేటర్ కొమురవెల్లి చంద్రకళ ఆధ్వర్యంలో 35 మంది మహిళలు పాల్గొన్నారు.