calender_icon.png 4 February, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

04-02-2026 01:57:22 AM

భద్రాచలం, ఫిబ్రవరి 3, (విజయక్రాంతి):  ఏటూరు నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలలో ఐటీడీఏ భద్రాచలం విద్యార్థినీ విద్యార్థులు రెండవసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా సంతోషకరమని క్రీడల విజయాత్ర ఇంతటితో ఆగకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని భద్రాచలం ఐటిడిఏ కు మంచి గుర్తింపు తీసుకొని రావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

మంగళవారం  రాత్రి ఐటిడిఏ సమావేశ మందిరంలో జనవరి 7,8,9 తేదీలలో ఏటూరు నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలలో అథ్లెటిక్స్ , అన్ని విభాగాల ఆటలలో గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ఉత్తమ ప్రతి కనబరిచి రాష్ట్రస్థాయి రెండవసారి ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు అనేది సహజమని ఆడే ప్రతి ఆట గెలవడా ప్రయత్నించాలని అన్నారు.

టీం మొత్తం కలిసి కట్టుగా ఉండి పీడీలు పీఈటీలు కొచులు విద్యార్థిని విద్యార్థులు అందించిన సహాయ సహకారాలు, సలహాలు, సూచనల వలన ఇంతటి పెద్ద విజయం సాధించారన్నారు. విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు మీకు ఇష్టమైన క్రీడలలో పాల్గొని మీయొక్క ఆటను మెరుగుపరచుకొని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని అత్యధిక పథకాలు సాధించి స్పోరట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలని అన్నారు.

ఈ సంవత్సరం ప్రత్యేకంగా పది పాఠశాలలకు అన్ని రకాల క్రీడా వస్తువులు అందిస్తానని అలాగే ఫుట్బాల్, సాఫ్ట్బాల్, హాకీ క్రీడలను కూడా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో వాటికి సంబంధించిన మెటీరియల్ త్వరలో అందిస్తానన్నారు. ఈ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలలో పాల్గొనటానికి ఐటీడీఏ భద్రాచలం జోన్ నుండి 240 మంది క్రీడాకా రులు పాల్గొన్నారనీ, 28 మంది పీడీ, పీఈటీస్ కోచులుతో కలిపి 268 మంది రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడల్లో పాల్గొని 10 క్రీడాంశాలు వాలీబాల్, కబడ్డీ, కోకో, అథ్లెటిక్స్ అర్చరి, టెన్నికాయిట్, చెస్, రెజ్లింగ్,

క్యారమ్స్, పరుగు పందెం సీనియర్, జూనియర్ బాలబాలికలు పాల్గొని అన్ని క్రీడలలో విజయం సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని మన ఐటీడీఏ కు మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్పోరట్స్ ఆఫీసర్ గోపాలరావు, అసిస్టెంట్ స్పోరట్స్ ఆఫీసర్ రాంబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు హరికృష్ణ, మోతిలాల్, హైమావతి, అంజయ్య, రవీందర్, కృష్ణారావు, శిరోమణి, వెంకటేశ్వర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.