22 April, 2026 | 2:08 AM

సుకన్య సమృద్ధి పథకం ద్వారా చెక్కులను అందజేసిన కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్

22-04-2026 12:19 AM

మొయినాబాద్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఆడబిడ్డ పుడితే సుకన్య సమృద్ధి పథకం ద్వారా 5వేల రూపాయల చెక్కులను అందజేసిన కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లి లోగల 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ ఎన్నికల్లో ప్రతి ఇంట పుట్టిన ఆడబిడ్డకి సుకన్య సమృద్ధి పథకం ద్వారా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 9వ వార్డుకు చెందిన హనుమసాని మౌనిక రాఘవేందర్ యాదవ్ దంపతులకు జన్మించిన కవల పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 5వేలు చొప్పున మొత్తం రూ. 10వేల రూపాయల మొదటి చెక్కును ఆయన చేతుల మీద అందజేశారు.

అదే వార్డుకు చెందిన చేవెళ్ల శ్రీవాణి ప్రవీణ్ దంపతులకు జన్మించిన ఆడబిడ్డకు రూ.5వేల రూపాయల రెండవ చెక్కును కూడా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంట పుట్టిన ఆడబిడ్డకు సుకన్య సమృద్ధి పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ ను వార్డు ప్రజలు అభినందించి. ఇలాంటి ఆర్థిక భరోసా ఒక దిక్సూచిగా నిలుస్తుందని వార్డు ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రఘు, శ్రీకాంత్, రాఘవేందర్, బాల్ రాజ్, ఆంజనేయులు, వెంకటేష్, చందు, నవీన్, సాయి తేజ, మహేష్, విగ్నేష్, కుమార్, మహేందర్, నరేష్, యోగేష్, వరప్రసాద్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.