20 August, 2026 | 2:41 AM

అంతిమ దశలో అక్రమ నిర్మాణాలు

20-08-2026 12:03 AM
  1. డొమెస్టిక్ పర్మిషన్స్, కమర్షియల్ కన్స్ట్రక్షన్ 
  2. నో సెట్ బాక్స్, ప్రశ్నార్థకంగా పైర్ సేఫ్టి 
  3. లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు
  4. ప్రభుత్వ ఆదాయానికి గండి 
  5. యథేచ్ఛగా నిర్మాణాలు

చేవెళ్ల ఏప్రిల్ 22 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. 14వ వార్డు ఇంద్రారెడ్డి నగర్ లో జి ప్లష్ 4 అక్రమ బవంతి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజా సౌలభ్యం సేఫ్టీ మెజర్మెంట్స్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ పనిచేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెసిడెన్సియల్ పర్మిషన్తో కమర్షియల్ కట్టడాలు చేపడుతున్న అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

లోపాయి కార ఒప్పందంలో భాగంగానే ఈ కట్టడాలు జ రుగుతున్నాయని ఆరోపణలు స్థానికంగ వెల్లువెత్తుతున్నాయి. విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఒప్పందంలో భాగంగానే అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోగా ఈ లోపు అక్రమ నిర్మాణాలు అంతిమ దశకు చేరుకుంటున్నా యి. యాదెచ్చగా జరుగుతున్న ఈ  అక్రమ నిర్మాణాల వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. సెట్ బాగ్స్ వదలకుండా ఏకంగా జి ప్లస్ ఫోర్ కాంప్లెక్స్ పై పెన్త్ హౌస్ నిర్మాణంతో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో సె ట్టర్స్ నిర్మాణాలు వేస్తున్నారు. 

కమర్షియల్ నిర్మాణం కనిపించడం లేదా..

సదరు మున్సిపల్ అధికారులకు బిల్డింగ్ యజమాని పెట్టుకున్న అప్లికేషన్ ప్రకారం అధికారులు డొమెస్టిక్ కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అనంతరం సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఫీల్ విజిట్ చేయాల్సి ఉన్నప్పటికీ అటుపక్క వెళ్తున్నారో లేదో నన్ను అనుమానం ప్రజల్లో ఉత్పన్న మవుతుంది. ఒకవేళ ఫీల్ విజిట్ కి వెళ్ళిన  అధికారులకు కమర్షియల్ నిర్మాణం కనిపించడం లేదా అన్నా ప్రశ్నలు వెల్లువె త్తుతున్నాయి. అధికారుల చేతివాటంతోనే అక్రమ నిర్మాణాలు శర వేగంగా సాగుతున్నాయని ప్రచారం జరుగుతుంది.

అక్రమాల నీడలో సేద తీరుతున్న అధికారులు

కాసులకు అలవాటు పడ్డ అధికారులు అక్రమ కట్టడాల నీడలో సేదతీరుతున్నరనట్టుగా అధికారులు అవాలంబిస్తున్న తీరును ఆకాశ మేడలు చెబుతున్నాయి. మునిసిపల్ హెచ్‌ఎండిఏ రూల్స్ గాలికి వదిలేసి అక్రమ నిర్మాణదారులతో అంటకాగుతుండ్రని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

మున్సిపల్ ఆదాయానికి గండి

డొమెస్టిక్ పర్మిషన్ తో కమర్షియల్ నిర్మాణాలు చేయొద్దు ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతుంది. దీంతో ప్రభుత్వ పద్దుకు గండిపడడమే కాకుండా పాలనకు గాడి తప్పి ప్రాంత అభివృద్ధికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కొందరి అధికారుల స్వార్థం సమన్వయ లోపం అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. నిర్మాణం ప్రారంభమైన నెలల వ్యవధిలోనే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. ఈ అక్రమ కట్టడాలపై చేవెళ్ళ మున్సిపల్ కమిషనర్ బి యాదగిరికి వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేరు.