కట్టరాంపూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
13-07-2026 03:07 PM
కట్టరాంపూర్‌లో రూ. 10 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముకరంపుర, జూలై 13(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 10వ డివిజన్ కట్టరాంపూర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 10 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు హాజరై అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య , మున్సిపల్ అధికారులు,10వ డివిజన్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.






