పత్తి..తీరని దాహార్తి..!
ముందు మురిపించి ఇప్పుడు ఏడిపిస్తున్న వరుణుడు
చినుకు జాడ లేక.. మొఖం మాడుస్తున్న పత్తి చేను
కీలకదశలో కరువైన వాన చినుకు
ఆందోళనలో రైతులు
చిట్యాల, ఆగస్టు 27: సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాధారం గా సాగు చేస్తున్న పత్తి పంటకు కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో పంట పొలాల్లో తేమ పూర్తిగా తగ్గిపో యి మొక్కలు వాడిపోతున్నాయి. ఇప్పటికే పత్తి సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీలకు రై తులు భారీగా ఖర్చు చేశారు. అయితే పంట ఎదుగుదలకు అవసరమైన వర్షం లేకపోవడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయా లేదా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
ఆకాశం వైపు చూస్తున్న రైతన్న
పత్తి విత్తనాలు వేసిన తొలినాళ్లలో పలుచోట్ల కురిసిన వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. విత్తనాలు మొలకెత్తి మొక్క లు ఏపుగా ఎదగడంతో ఈసారి పంట దిగుబడి బాగుంటుందని భావించారు. కానీ ఆ తర్వాత వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారి పోయింది. పొలాల్లో భూమి పగుళ్లు ఏర్పడి, నేలలో తేమ తగ్గిపోవడంతో పత్తి మొక్కలు నీటి కోసం అల్లాడుతున్నాయి. పచ్చగా కనిపించాల్సిన పత్తి చేనులు క్రమంగా వాడిపో తుండటంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నా యి. ఉదయం పొలానికి వెళ్లిన రైతులు సా యంత్రం వరకు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
పెట్టుబడి తడిసి మోపెడు
పత్తి సాగు రైతులకు ప్రతి సీజన్లోనూ ఆర్థికపరంగా భారంగానే మారుతోంది. విత్తనా ల ధరలు, ఎరువులు, పురుగుమందులు, దున్నకాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండటంతో ఎకరాకు పెట్టుబడి గణనీయంగా పెరిగింది. అప్పులు చేసి సాగు చేస్తున్న రైతు లు పంట దిగుబడిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుతం పంట పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
మొఖం చాటేసిన వరుణుడు
కీలకదశలో వరుణుడు మొఖం చాటేయడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. ప త్తి పంటకు మొక్కల ఎదుగుదల, పూత దశ తదితర కీలక సమయాల్లో తగినంత తేమ అవసరం. ఈ సమయంలో వర్షాలు లేకపోవడం పంటపై తీవ్ర ప్రభావం చూపే అవ కాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. తేమ తగ్గిపోవడంతో మొక్కలు ఎదుగుదల కోల్పోవడంతో పాటు పూత, కా యల ఏర్పాటుపై కూడా ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు అందుబాటులో ఉన్న బోర్లు, వ్యవసాయ బావుల ద్వారా నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని పొలాలకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో వర్షంపైనే ఆధారపడాల్సి వస్తోంది.
వర్షం వస్తేనే పంటకు ప్రాణం
ఇప్పటికే ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు చేశాం. పంట బాగుంటుందని ఆశపడ్డాం. ఇప్పుడు వర్షం లేక మొక్కలు వాడి పోతున్నాయి. మరోసారి వర్షం కురిస్తే పం ట కొంతవరకు కోలుకునే అవకాశం ఉంది. లేదంటే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి వస్తుంది అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఒక్క వర్షంతో పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఆ వర్షం ఎప్పుడు కురుస్తుందో అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న పత్తి రైతుల పరిస్థితిని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. పంటల పరిస్థితిపై మండలాల వారీగా సర్వే నిర్వహించి, వర్షాభావ ప్రభావాన్ని అంచనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైన చోట్ల ప్రత్యామ్నా య పంటలు, పంట సంరక్షణ చర్యలు, నీటి వినియోగంపై రైతులకు సలహాలు అందించాలని కోరుతున్నారు. వర్షాలు మరింత ఆలస్యమైతే పంట నష్టం జరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వాన కురిస్తేనే చేను బతికేది
నాకున్న మూడు ఎకరాల భూమితో పాటు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొత్తం ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశా ను. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీల కోసం భారీగా పెట్టుబడి పెట్టాను. పంట బాగా పండితే అప్పులు తీర్చి కుటుంబాన్ని ఆదుకోవచ్చని ఆశించాను.
కానీ కీలక సమ యంలో వర్షాలు కురవకపోవడంతో ప త్తి మొక్కలు వాడిపోతున్నాయి. కౌలు భూమికి చెల్లించాల్సిన డబ్బుతో పాటు సాగు పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరోసారి మంచి వర్షం కురిస్తేనే పంట కొంతవరకు కోలుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం మా ప రిస్థితిని గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి.
అనంతుల సైదులు గౌడ్, పత్తి రైతు, తాళ్ల వెళ్ళాంల గ్రామం






