ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కార్పొరేటర్
08-07-2026 03:07 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నస్పూర్ మండల పరిధిలోని 33వ డివిజన్ లో తొర్రోళ్ల రాజేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కార్పొరేటర్ ఎంబాడి కుమార స్వామి బుధ వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుడిసెలు ఉండకూడదని, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ప్రత్యేకంగా అర్హులైన పేదలందరికి సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఎంబాడీ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.






