8 July, 2026 | 3:23 PM

పోచమ్మ బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

08-07-2026 03:05 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని సనుగుల గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించి గ్రామ ప్రజలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గ్రామ ప్రజలతో కలిసి మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.