14-02-2026 12:00:00 AM
చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలు సైతం హస్తగతం...
క్యాతనపల్లి పీఠం బీఆర్‌ఎస్‌దే బెల్లంపల్లిలో చేయి, కారు సమానం..
ఇండిపెండెంట్లే కీలకం
జిల్లాలో రసవత్తరంగా మున్సిపల్ ఫలితాలు
మంచిర్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): జిల్లాలో ముగ్గురు ఎంఎల్‌ఏలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండగా ము న్సిపాలిటీలు అన్ని హస్తగతమవుతాయన్న వారి ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకుంటుందనడానికి శుక్రవారం మున్సిపాలిటీ ఫలితాలే నిదర్శనంగా చెప్పవచ్చు. మంచిర్యాల నియోజక వర్గంలో ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు లక్షెట్టిపేట మున్సిపాలిటీలను గెలిపించుకోగా కార్మిక మంత్రి, చెన్నూర్ ఎంఎల్‌ఏ గడ్డం వివేక్ వెంకట స్వామి క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కు అందించి ఒక చెన్నూర్ లో చైర్మన్ పీఠాన్ని బతికించుకున్నారు.
బెల్లంపల్లి నియోజక వర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బెల్లంపల్లిలో ఎంఎల్‌ఏ గడ్డం వినోద్ దక్కించుకుం టాడా లేక చేయి వదులుతాడా! అనే సందిగ్ధంలో ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమానంగా పంచుకోగా బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఐదుగురు విజయం సాధించారు. ఈ ఆరుగురు ఎవరికి సఫోర్టు చేస్తే వారే చైర్మన్ గిరిని దక్కించుకునే అవకాశం ఉండగా ఈ విషయంలో ఎంఎల్‌ఏ వినోద్ గెలుస్తారో, మాజీ ఎంఎల్‌ఏ దుర్గం చిన్న య్య పంతం నెగ్గించుకుంటారో వేచి చూడా లి. మంచిర్యాల కార్పొరేషన్ కు మొట్ట మొదటి సారి జరిగిన కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది.
రసవత్తరంగా మున్సిపల్ ఫలితాలు..
జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీ ఫలితాలు రసవత్తరంగా మారాయి. మంచిర్యాల నియోజక వర్గంలో వార్ వన్ సైడ్ (మంచిర్యాల కార్పొరేషన్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం) కాగా చెన్నూర్ నియోజక వర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో ఒకటి (చెన్నూర్ మున్సిపాలిటీ) కాంగ్రెస్, మరోటి (క్యాతనపల్లి మున్సిపాలిటీ) బీఆర్‌ఎస్ పంచుకుంది. ఇక బెల్లంపల్లి నియోజక వర్గంలోని వార్డులను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు సరిసమానం గా పంచుకోగా ఇండిపెండెంట్ల మీద ఫలితం ఆధారపడి ఉంది. మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అనారోగ్యంతో నియోజక వర్గ ప్రజలకు ఏడు నెలలుగా దూరంగా ఉన్నా మంచిర్యాల, లక్షెట్టిపేటలలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారని బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం.
149 వార్డులకు 87 కాంగ్రెస్‌వే..
జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల పరిధిలోని 149 (60 డివిజన్ లు, 89 కౌన్సిలర్ స్థానాలకు) వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరుగగా శుక్ర వారం వెలువడిన ఫలితాల గాలి కాంగ్రెస్ వైపే వీచినట్లయింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 44 కాంగ్రెస్ దక్కిం చుకోగా బీఆర్‌ఎస్ ఎనిమిది, బీజేపీ ఐదు, ఏఐఎఫ్బీ రెండు, జనసేన ఒక స్థానంలో గెలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 14, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఐదు స్థానా లు గెలిచాయి. అలాగే చెన్నూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ నాలుగు, బీజేపీ రెండు, స్వతంత్రులు ఒకరు విజయం సాధించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులలో కాంగ్రెస్ ఏడు, బీఆర్‌ఎస్ పది, సీపీఐ నాలుగు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 వార్డులలో 11 కాం గ్రెస్ గెలుచుకోగా మూడు బీఆర్‌ఎస్, ఒక వార్డు బీజేపీ విజయం సాధించింది. జిల్లా వ్యాప్తంగా 149 వార్డులకు 87 కాంగ్రెస్ సొం తం చేసుకోగా బీఆర్‌ఎస్ 39, బీజేపీ తొమ్మి ది, సీపీఐ నాలుగు, ఏఐఎఫ్బీ రెండు, జనసేన ఒక స్థానం, ఇండిపెండెంట్లు ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. మంచిర్యాల కార్పొరేషన్‌ను మినహాయించి నాలు గు మున్సిపాలిటీల ఫలితాలను గమనిస్తే 89 వార్డులకు కాంగ్రెస్ 43, బీఆర్‌ఎస్ 31, బీజేపీ స్థానాలు సాధించినట్లయింది.
