20 May, 2026 | 4:51 AM

కార్పొరేట్ల ‘డిస్కౌంట్’

20-05-2026 12:23 AM

మాయాజాలంపై వ్యాపారుల ఆగ్రహం

చిన్న చింతకుంట మే 19 : కార్పొరేట్ సంస్థల నకిలీ ధరల విధానాలు, దీర్ఘకాలిక డిస్కౌంట్ల వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న చిన్న కెమిస్టులను, మం దుల దుకాణదారులను ఆదుకోవాలని కోరుతూ స్థానిక కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం స్థానిక తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మందులు అనేవి సామాన్యమైన వస్తువులు కావని, అవి నేరుగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.

అర్హత కలిగిన వైద్యులు, నమోదిత ఫార్మాసిస్టుల ద్వారా మాత్రమే రోగులకు సరైన మందులు అందేలా ప్రస్తుత వ్యవస్థ నిర్ధారిస్తుందని, ఇందులో ఎలాంటి మార్పులు చేసినా ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక మందుల దుకాణదారులు పాల్గొన్నారు.