ప్రజల శాంతియుత జీవనం కోసమే కార్డెన్ అండ్ సెర్చ్: డి ఎస్పి
20-05-2026 12:31 PM
తాండూరు,(విజయక్రాంతి): ప్రజల శాంతియుత భద్రత జీవనం కోసమే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ డిఎస్పి తెలిపారు. బుధవారం ఇందిరమ్మ కాలనీలో తెల్లవారుజామున పోలీస్ బలగాలతో ఇంటింటా తనిఖీ చేశారు. నివాసం ఉంటున్న వారు స్థానికులేనా? ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
సరైన ధ్రువపత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నూతన వ్యక్తులు, అనుమానస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, రూరల్ సీఐ, లతోపాటు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






