ఈనెల 28న హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
మంథనిలో పోస్టర్ ఆవిష్కరణలో ఉమ్మడి జిల్లా ఇంఛార్జి కావటి సతీష్ యాదవ్
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్.కావటి సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం మంథని పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నియమించిన శైలా కమిటీ నివేదికపై తక్షణమే స్పందించి, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ మరియు సరైన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వారి సంక్షేమం కోసం శైలా కమిటీని నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఉద్యమకారులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు, ఉద్యమకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యమ నాయకులు, ప్రతినిధులు పాల్గొని ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.






