calender_icon.png 5 February, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

05-02-2026 12:33:13 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి బుధవారం మృతి చెందారు. రామారెడ్డి గ్రామానికి చెందిన రవి 35 విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యో గీగా పని చేస్తున్నారు. విద్యుత్ లైన్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై స్తంభం పైనే మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులు బంధువులు నష్ట పరిహారం మృతుని కుటుంబానికి చెల్లించాలని ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామని కాంట్రాక్టు ఉద్యోగి కాబట్టి డబ్బులు రావని ఉన్నతాధికారులకు మాత్రం నివేదించి డబ్బులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.