05-02-2026 12:34:48 AM
నిర్మల్‌లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిర్మల్, ఫిబ్రవరి ౪ (విజయక్రాంతి): నిర్మ ల్ పట్టణంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కాంగ్రె స్, ఎంఐఎం పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే అరాచక పాలన వస్తుందని ప్రజలకు తెలుసు చెప్పారు. పట్టణంలోని మైనార్టీ వార్డు లో ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు.
నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్ముకయ్యాయని ఆ పార్టీలు గెలిస్తే మున్సిపాలిటీలో అరాచక పాలన వస్తుందని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ముస్లిం పాలన రాచక పాలన కావాలో అభివృద్ధి పాలన కావాలో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.