calender_icon.png 18 February, 2026 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణ అభివృద్ధికి నిరంతరం పాటుపడండి

18-02-2026 09:43:07 PM

నూతన చైర్మన్ పాలకవర్గాన్ని అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ అభివృద్ధికి నిరంతరం పాటుపడండని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నూతనంగా కొలువైన మున్సిపల్ చైర్మన్ పాలకవర్గాన్ని కోరారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గం మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా  హైదరాబాద్ లోని  రాష్ట్ర సచివాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా నూతన పాలక వర్గంతో పాటు ఎకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతయుతంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు ఉన్నారు.