7 July, 2026 | 7:30 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

గ్యాస్ కోసం వినియోగదారుల ఆందోళన

06-05-2026 12:00 AM

నెలలు గడుస్తున్న  గ్యాస్ సప్లై అందజేస్తలేరని నిరసన

 అబ్దుల్లాపూర్ మెట్, మే 5: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తూ సామాన్య ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపిస్తూ పెద్ద అంబర్ పేట్ లో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ఎదుట వినియోగదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. నెలలు గడుస్తున్నా  గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపించారు. 

గ్యాస్ అందజేయడంలో  లక్ష్మీ గణపతి  భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే  వినియోగదారు లు  విజయవాడ - హైదరాబాద్ సర్వీస్ రోడ్ మార్గంలో కొద్ది సేపు  ఆందోళన  చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందేలా చూస్తామని ఏజెన్సీ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు.