27 April, 2026 | 9:14 PM

మట్టి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

27-04-2026 04:55 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా తండా గ్రామంలో ఇరిగేషన్ నిధులు పది లక్షల రూపాయల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ కు వెళ్ళే మట్టి రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ మాలోతు భద్రమ్మ బాబు నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన బాట గురించి మఠంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియగా ఆయన సహకారంతో నేడు మట్టి రోడ్డు పనులను ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు నిర్మాణంతో పొలాలకు వెళ్ళే స్థానిక రైతుల రాక పోకలకు సులభంగా మారుతుందని ఆమె తెలిపారు.