calender_icon.png 21 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలి

21-02-2026 12:00:00 AM

మరిపెడ, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మరిపెడ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్, నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకయ్య డిమాండ్ చేశారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిపిఐ పార్టీ పక్షాన ప్రజాపోరాటాలు చేస్తామని,

ఆసుపత్రి నిర్మాణం త్వరగా అందుబాటులోకి తీసుకోరావాలని ప్రభుత్వాన్ని, కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. ఆస్పత్రికి కేటాయించిన స్థలంలో కొంత కబ్జాకు గురైందని, కబ్జాలు తొలగించి ఆస్పత్రి ప్రధాన ద్వారం, ఇతర నిర్మాణాలు సక్రమంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లింగన్న, అంజి పాల్గొన్నారు.