వాగును ఆనుకొని నిర్మాణం.. అడ్రస్ లేని అధికారులు
07-05-2026 11:15 AM
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో ఖమ్మం రోడ్డులో 18వ వార్డు పరిధిలో తమ్మర వాగును ఆనుకొని నిర్మాణం జరుగుతుంది. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేయించడంతో పాటు మళ్లీ నిర్మాణాలు చేయవద్దని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరంతా ఈ వాగు ద్వారానే వెళ్లిపోవాల్సి ఉంది. వాగుకు అడ్డంకి ఉంటే నీరంతా షిర్డీ సాయి నగర్(Shirdi Sai Nagar)ను ముంచెత్తుంది. ఇప్పుడు మళ్లీ తాజాగా నిర్మాణం జరుగుతుంది. అధికారులు స్పందించకపోవడంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వాగును ఆనుకొని నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.






