7 May, 2026 | 11:45 AM

ఖమ్మం సుడా చైర్మన్ గా పువ్వాళ్ళా

07-05-2026 11:20 AM

గ్రంథాలయ చైర్మన్ గా మహ్మద్ ఖాధర్ బాబా

ప్రకటించిన ప్రభుత్వం 

ఖమ్మం, మే 7 (విజయక్రాంతి): ఖమ్మం హుడా చైర్మన్ గా ఖమ్మం జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి నియామకం జీవోను విడుదల చేసింది. దుర్గాప్రసాద్ గత పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దుర్గాప్రసాద్ రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు 9 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

అలా పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్ ను కాపాడుకోవడంలో ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఆ కష్టానికి ఫలితం గానే ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సుడా చైర్మన్ గా నియమించింది. ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కు జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గ్రంథాలయ చైర్మన్ గా మహ్మద్ ఖాధర్ అలీ ని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం నగరానికి చెందిన ఇతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు.