3 March, 2026 | 4:52 AM

అన్నారంపై కుట్ర

03-03-2026 01:15 AM

భారీ ఎక్స్‌కవేటర్లతో ఇసుక తవ్వకాలు దుర్మార్గం 

ఈ మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుతంత్రం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్‌పై కుట్రలు చేసింది చాలదన్నట్టు ఇప్పుడు అన్నారం బరాజ్‌ను కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిబంధనల కు పాతరేసి ఏకంగా బరాజ్ కిందే భారీ ఎక్స్‌కవేటర్లతో ఇసుక తవ్వకాలు చేపట్టడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని మండిపడ్డారు.

బరాజ్ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడ దన్న నిబంధనలను తుంగలో తొక్కిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఏకంగా బరాజ్‌ను బలహీనపరిచి బీఆర్‌ఎస్‌పై బురదజల్లే పన్నా గాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సోమవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటివరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచక పర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్.. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం పిల్లర్ల వద్ద ఇసుక తవ్వి బరాజ్‌ను ప్రమాదంలోకి నెడుతున్నదని, ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రేనని మండిపడ్డారు.

పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బరాజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుక ను తోడేస్తున్నదని, తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొ డుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది అని పేర్కొన్నా రు. కాళేశ్వరం బరాజ్‌లకు ఏమై నా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రె స్‌దే అని హెచ్చరించారు.

అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. అనే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగుతున్నదన్నారు. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్ అని కేటీఆర్ హెచ్చరించారు.