calender_icon.png 6 February, 2026 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది

06-02-2026 12:05:26 AM

గౌడ సర్పంచుల ఆత్మీయ అభినందన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బీసీలు అంటే పాలితులు కాదని, పాలకులని మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిరూపించారని రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు గురించి సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తే బీసీలు ఓటు చైతన్యంతో 52% సర్పంచులుగా గెలిచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని సర్పంచ్ ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఈ మేరకు గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సేన జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులకు ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ అభినందన సభ జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టికూటి రామారావు గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లను శాలువలతో సన్మానించి మె మొంటోను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బత్తిని రాజు గౌడ్, ఘనగాని మల్లేష్ గౌడ్,డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్, రేఖ గౌడ్, కుంచాల ఏడుకొండల గౌడ్, సుర్వి యాదయ్య గౌడ్, అశోక్ కుమా ర్ గౌడ్, సాంబశివ గౌడ్, రజని కుమారి గౌడ్, పరశురాం, సత్యరాజ్ గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.