26 May, 2026 | 1:01 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్

06-04-2026 11:07 AM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు గైని సాయి మోహన్ ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు. ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తారనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరనీ, నిర్బంధాలు మా పోరాట పటిమను ఇంకా పెంచుతాయి తప్ప తగ్గించవన్నారు. పోలీసులు వెంటనే గైని సాయిమోహన్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలపడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ (రెడ్డి) ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.