6 April, 2026 | 12:55 PM

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

06-04-2026 11:06 AM

కాగజ్ నగర్,విజయక్రాంతి: కాగజ్ నగర్ పట్టణం సర్సిల్క్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాజపా జెండా ఎగురవేసిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఎగర వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటాల వలన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, గ్రామ గ్రామాన, వీధి వీధిన భారతీయ జనతా పార్టీ వికసించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరభద్ర చారి, కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, గజ్జల లావణ్య లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ సింధం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, బాల్క శ్యామ్  భాజపా పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు అరుణ్ లోయ సాంబయ్య, రాణి, శకుంతల, మంజుల, అర్జున్, సౌరబ్, లోకేష్, సాయి, సంతోష్, శ్రీనివాస్, అనిల్, సదానందం, మహేష్, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.