7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవు

23-02-2026 09:42 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పరిశీలించి, అనంతరం మాట్లాడుతూ... వారంలో మూడు రోజులు తుంగతుర్తి క్యాంపు కార్యాలయంలో ఉండి, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం కృషి చేస్తానని అన్నారు. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలే ఓటమికి పాల్పడ్డారని వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీలో కొత్త ,పాతవారు అనే భేద అభిప్రాయాలు లేవని, అందరూ ఒకే గొడుగు కింద ఉండి రానున్న స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. తుంగతుర్తిలో రెండు కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చాయని, పేద ప్రజలు ఇంటి నిర్మాణ పనులు చేపట్టుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా మహాలక్ష్మి పథకం పింఛన్లు ఇందిరమ్మ ఇండ్లు , సన్న బియ్యం పంపిణీ అభివృద్ధి పథకాలు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు.

తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల భవనిర్మానం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తుంగతుర్తి అభివృద్ధి నా ధ్యేయమని నాయకుడు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పిఎసిహెచ్ చైర్మన్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచులు దాసరి రేణుక శ్రీనివాస్, కలకోట్ల మల్లేష్, చింతకుంట్ల మంజుల వెంకన్న, జ్యోతి భాస్కర్, పెద్దబోయిన అజయ్, జమ్మిలాల్ నాయక్, అనిల్ కుమార్ రాముల యాదవ్ డీప్ల నాయక్ ,విజ్జి నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.