7 July, 2026 | 6:24 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

రజకులపై దాడి అమానుషం

23-02-2026 09:46 PM

జిల్లా ఉపాధ్యక్షులు దొంతి గోపాల్ రజక

తూప్రాన్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని దాడిని జిల్లా రజక సంఘం  ఖండిస్తుంది అని జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షులు దొంతి గోపాల్ రజక  తూప్రాన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఇటువంటి ఘటన సభ్యు సమాజానికి సిగ్గుచేటుఅని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పసి పాప మృతికి కారణమైన వారిపై బిఎన్ఎస్ 316, బిఎన్ఎస్ 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి,నిందితులపై చర్యలు తీసుకోవాలని కులవివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.