నేడు కాంగ్రెస్ పార్టీ ఛలో లోక్‌భవన్
- రాహుల్ గాంధీ అరెస్ట్ నియంతృత్వ ధోరణికి పరాకాష్ట
- పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చెసి జైల్ కు తరలించడం దుర్మార్గమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసి నీట్ పరీక్ష పేపర్ లీక్‌ల విషయంలో పార్లమెంట్ లో సమగ్ర చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ కు బీజేపీ సర్కార్ భయపడిందన్నారు.
రాహుల్ గాంధీ తోపాటు ప్రతిపక్ష నేతలు అరెస్ట్‌లకు నిరసనగా బుధవారం ఛలో లోక్ భవన్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స్ లు, పార్టీ నాయకులు అందరూ భారీగా తరలివచ్చి బీజేపీ నిరంకుశ పాలనపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఖండించారు. ప్రజాస్వామ్య గొంతును అణిచివేయలేరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.






