11 May, 2026 | 10:13 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

గెలుపుతో మరింత బాధ్యత పెంచారు

14-02-2026 01:25 AM

ప్రజా ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజల మద్దతుకు లభించిన ఫలితాలు..

ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి 

వనపర్తి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మద్దతుకు వచ్చిన ఫలితాలతో మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి, తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డిలు అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా  అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ  విశ్వసించి మంచి ఫలితాలు ఇచ్చారన్నారు. మున్సిపాలిటీ చరిత్రలో 33 వార్డులకు గాను 22 మందిని గెలిచారని, అలాగే పెబ్బేరు మున్సిపాలిటీల 12 వార్డులకు గాను 7 మంది నీ గెలిపించిన పెబ్బేర్, వనపర్తి ప్రజలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అవినీతి పాలనకు ఆస్కారం ఇవ్వకుండా, అవినీతిరహిత పాలన కోసం  మున్సిపల్ పాలకవర్గం పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  టిపిసిసి సెక్రెటరీ  నందిమల్ల యాదయ్య, మాజీ డిసిసి అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.