11 May, 2026 | 11:16 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ధర్మపురిలో అడ్లూరి మార్క్ పాలన

14-02-2026 01:25 AM
  1. ‘ధర్మపురిలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం 

 ‘15 వార్డులను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ 

ధర్మపురి,ఫిబ్రవరి13 (విజయక్రాంతి):జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ అడ్లూరి మార్క్ పాలన కొనసాగుతోంది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15వార్డులను క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. రెండేళ్ల పాలనలో స్థానిక శాసన సభ్యులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ధర్మపురి ప్రజలు రాష్ట్ర చరిత్రలోనే అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు.

దీనితో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది. బీజేపీ,బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీనీ ఇవ్వలేకపోయారు. అఖండ మెజార్టీ అందించిన ధర్మపురి పట్టణ ప్రజలకు మున్సిపల్ పాలకవర్గం నిత్యం అందుబాటులో ఉంటూ అత్యద్భుతమైన సుపరిపాలన అందించి ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాధించుకోవాలనీ మంత్రి అడ్లూరి పాలకవర్గానికి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే అఖండ విజయాన్ని అందించిన ధర్మపురి పట్టణ ప్రజలకు సదా ఋణస్థులం అంటూ మంత్రి అడ్లూరి ఈ సందర్బంగా పేర్కొన్నారు.