రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు
మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనీ నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నూతనంగా నియమితులైన బైరు అశోక్ గౌడ్, ఎదల్ల యాదవ రెడ్డి, చిలువేరు సమ్మయ్య గౌడ్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తమను నూతనంగా మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మండల పార్టీ అధ్యక్షులను వేం నరేందర్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో అర్హులైన వారికి అందించే విధంగా కృషి చేస్తూ, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.






