22 August, 2026 | 2:36 AM

నేరాల నిరోధానికి సీసీటీవీ కెమెరాలు దోహదం

22-08-2026 12:52 AM

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ

కోదాడ, ఆగస్టు 21 : నేరాల నిరోధానికి, నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలు దోహదపడతాయని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. శుక్రవారం కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్పవర్తనకు కమిటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, నేరగాళ్ళ కదలికలు, గంజాయి రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

తొలుత సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి సామర్థ్యంతో పని చేసి బాధితులకు, పౌరులకు పోలీసు సేవలు అందించాలని అన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న కోదాడ రూరల్, అనంతగిరి, చిలుకూరు, చింతలపాలెం, మెళ్లచెరువు పోలీస్ స్టేషన్ లకు సంభందించిన కేసుల నమోదు, దర్యాప్తు పరిశీలించారు. అయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల చరిత్ర రికారడ్స్ ను, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ రికారడ్స్ తనిఖీ చేశారు,

సర్కిల్ పరిధిలో ఉన్న స్టేషన్ ల పనితీరు, సిబ్బంది పనితీరు బాగా ఉన్నది అని అభినందించారు, కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ సర్కిల్ ఇంచార్జీ సిఐ మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, ఎస్‌ఐ లు నవీన్ కుమార్, యాకూబ్, అంజి రెడ్డి, డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు.