calender_icon.png 17 February, 2026 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

17-02-2026 02:02:23 AM

నా ఎక్స్ అఫీషియో ఓటు హక్కును కాలరాస్తున్నది

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్ అఫిషియో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

కానీ ఈ రాజ్యాంగబద్ధమైన హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి తనను నామినేటెడ్ ఎమ్మెల్సీ/ఎంపీగా గుర్తిస్తూ ఓటు వేసే హక్కును కాలరాస్తూ.. ఓటు వేయడాన్ని కలెక్టర్ నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లు ఓటు వేస్తేనే గెలిచిన తనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో ఓటు వేసే హక్కు ఉం టుందని స్పష్టం చేశారు. ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.