calender_icon.png 17 February, 2026 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి మనదే

17-02-2026 02:00:43 AM

బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 299 శాతం పెరుగుదల

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణే సృష్టించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప ష్టం చేశారు. 2023 గాను ఐటీ ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా గా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విష యం తేలిందని వివరించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పం దించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఐటీ ఎగుమతుల్లో 299 శాతం పెరుగుదల నమోదైందని గుర్తు చేశారు. 2013 అప్పటి కాంగ్రె స్ పాలనలో రూ.57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ విప్లవాత్మకమైన నిర్ణయాలు, వినూత్న పాలసీలు, సరికొత్త కార్యక్రమాల వల్ల 2023 నాటికి రూ.2,72,076 కోట్లకు చేరిందరి వెల్లడించారు.

కేసీఆర్ దార్శనికత వల్ల తెలంగాణ ఐటీ పవర్ హౌస్‌గా మారింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని స్పష్టం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఐటీ రంగంలో తెలంగాణ అనేక రికార్డులు సాధించిందని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అత్యధిక పెరుగుదల కనబర్చిందని, ఐటీ ఉద్యోగాల్లో పెరుగుదల 209 శాతంగా నమోదైందని వివరించారు. కొత్త ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 33 శాతమని తెలిపారు. 2023 తెలంగాణలో మొత్తం ఐటీ ఉద్యోగాలు 10 లక్షలు కాగా, ఒక్క ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా లభించే ఉద్యోగాల సంఖ్య 4 అని తెలిపారు. ఈ లెక్కన మిగతా రంగాల్లో జరిగిన ఉద్యోగాల సృష్టి 40 లక్షలు అని స్పష్టం చేశారు.