కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు
* రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
* కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలి
* మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
భూత్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్న సాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ మీటింగ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు. కేంద్రం ఎంత కొంటే రైతుల నుంచి అంతే కొనుగోలు చేస్తామని, మా వల్ల కాదంటూ స్టేట్మెంట్ ఇవ్వడం సరైనది కాదన్నారు.
రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేక హామీలు ఇచ్చారని, ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టిందని, రైతులు అరిగోశ పడుతున్నారన్నారు. రెండున్నర ఏళ్లలో మూడుసార్లు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఏగొట్టిందన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను దగా చేసిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హాయంలో కేంద్రం కొన్నది 50 లక్షల మెట్రిక్ టన్నులే కానీ రైతు పండించిన ప్రతి గింజను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
బోనస్ అన్ని పంటలకు ఇస్తానని కేవలం సన్నబడ్లకే పరిమితం చేశారన్నారు. ఆఖరికి రెండు పంటల కాకుండా కేవలం ఒక పంటకు మాత్రమే అరకొరగా వేస్తున్నారన్నారు. రైతులకు లాభం చేకూర్చల్సింది పోయి వారిని నెలుపు దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్నారు. 33 రకాలకు బోనస్ ఇవ్వమని ఎనిమిది రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామనడం విడ్డూరమన్నారు. తెలంగాణ రైతంగం కష్టపడి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
యూరియా షాపుల్లో యూరియా ఉంటుంది కానీ యాప్ లో యూరియా స్టాక్ ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల రైతులను నష్టపోవాల్సి వస్తుందన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి 72 రోజులు అవుతున్న రైతులకు ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు అనేక తిప్పలు పడాల్సింది వస్తుందన్నారు. యూరియా స్టాక్ ముందుగానే ఎందుకు తెప్పించుకోలేదని, కేసీఆర్ హయంలో యూరియా సమయానికి వచ్చేదని, ఇవాళ ఎందుకు రావట్లేదు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కష్టాలే ఉంటాయని ఆనాడే టిఆర్ఎస్ చెప్పిందన్నారు.
ఆ విషయం ఇప్పుడు అర్థమవుతుందన్నారు. పాలమూరులో లక్ష ఎకరాల నుండి 8 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచామని, కాంగ్రెస్ కొత్తగా ఒక ఎకరా కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. కెసిఆర్ కృషి వల్లే లక్షల టన్నుల దాన్యం తెలంగాణలో దిగుబడి వస్తుందన్నారు. పండించిన పంట కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.
చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా అండడం లేదని, 7000 మంది రైతులు చనిపోతే రైతు బీమా రాలేదన్నారు. రైతు భూమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతు చనిపోతే దినాలలోపే రైతు బీమా డబ్బులు జమ అయ్యే ఉన్నారు. మంచిగా నడుస్తున్న స్కీం లను కొనసాగించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, సత్యనారాయణ, అశోక్ రెడ్డి, తూము శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్ తో పాటు తదితరులు ఉన్నారు.






