calender_icon.png 12 February, 2026 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కలకు కాంగ్రెస్ భరోసా

12-02-2026 12:58:11 PM

ఇస్సన్నపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

భిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూరు మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల రాములు, ఉప సర్పంచ్ రాజమణి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగౌడ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద బాబు, గుడిసె నారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.