31 August, 2026 | 10:23 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

అత్యంత వైభవంగా బోనాల పండుగ

31-08-2026 09:13 AM

ఘట్ కేసర్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : బోనాల పండుగను ఘట్ కేసర్ పట్టణ ప్రజలు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంట రాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.

ఈ బోనాల ఉత్సవంలో  ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పల హారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.