భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
31-08-2026 09:29 AM
దేవరుప్పుల, ఆగస్టు 30 ( విజయక్రాంతి): మండల కేంద్రంలోని కొత్తవాడలో బోనాల వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గొని బోనం ఎత్తారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్, నాయకులు కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండు, కృష్ణ, రెడ్డిరాజుల రమేష్, తోటకూరి రమేష్, ఇనుముల నాగరాజు, ఉప్పుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.






