తప్పులు లేకుండా సర్వే నిర్వహించండి
16-05-2026 02:07 PM
బోథ్,(విజయక్రాంతి): ఇంటింటి సర్వేలో తప్పులు లేకుండా నిర్వహించాలని బోత్ తాసిల్దార్ మల్లేశం కోరారు.శనివారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వే పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. సర్వే లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఓ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.






