కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రద్దు ప్రయత్నాలు విరమించుకోవాలి
భిక్కనూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయకుండా ప్రజలకు అందించాలని కోరారు. పథకాల రద్దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ప్రజావాణిలో భాగంగా ఎంపీడీవో సవిత, తహసీల్దార్ సునీతకు బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






