బీఎస్పీ మండల,గ్రామ కమిటీలు ఎన్నిక
రుద్రంగి ఆగష్టు 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) మండల, గ్రామ కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీలను ప్రకటించారు.రుద్రంగి మండల బీఎస్పీ అధ్యక్షుడిగా దయ్యల ఉదయ్, ఉపాధ్యక్షుడిగా ఏనుగుందుల సతీష్, ప్రధాన కార్యదర్శిగా పోసు తిరుపతి, కోశాధికారిగా కట్కూరి వినోద్, సలహాదారుడిగా కాదాసు అనిల్ ను నియమించారు.
అదేవిధంగా రుద్రంగి గ్రామ బీఎస్పీ కమిటీ అధ్యక్షుడిగా నల్ల నవదీప్, ఉపాధ్యక్షుడిగా తర్రే గణేష్, ప్రధాన కార్యదర్శిగా లింగాల రవీందర్, కోశాధికారిగా లింగంపల్లి సుదర్శన్ను నియమించారు.ఈ సందర్భంగా కట్కూరి రమేష్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీలు ఈరోజు నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని కట్కూరి రమేష్ సూచించారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు కట్కూరి శంకర్, కాదాసు మహేందర్, పోసు తిరుపతి, గసికంటి సురేష్, కట్కూరి అనోక్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన మండల, గ్రామ కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు.






