12 May, 2026 | 8:48 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఎస్ఆర్ఆర్ పూర్వ విద్యార్థిని గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం

12-05-2026 07:30 PM

ముకరంపుర,(విజయక్రాంతి): విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచిన కుమారి కె. సుప్రియను తెలంగాణ ప్రభుత్వం సోమవారం సన్మానించింది. కరీంనగర్‌ లోని ఎస్.ఆర్.ఆర్  ప్రభుత్వ  కళాశాల విజ్ఞాన శాస్త్ర పూర్వ విద్యార్థిని సుప్రియ ఆమె సాధించిన విద్యా విజయాలకు గుర్తింపుగా  హైదరాబాద్‌ లోని ఎల్బి స్టేడియంలో  నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సుప్రియ రూ.1,00,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆమె అసాధారణ ప్రతిభకు మరియు అంకిత భావానికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. కుమారి సుప్రియ కరీంనగర్‌ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్.సి ఎంపీసీ పూర్తి చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆమె కళాశాల టాపర్‌ గా నిలిచి తన ప్రతిభను చాటుకుంటూ, ఆమె దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ  చెన్నైలో ఎం.ఎస్.సి ఫిజిక్స్ చదివే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె అక్కడ తన ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు.