తొగర్రాయిలో హనుమాన్ జయంతి
12-05-2026 07:36 PM
ఆలయ చైర్మన్ పగిడిమర్రి సరస్వతి మదన్ మోహన్
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామ వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ పగిడిమర్రి సరస్వతి మదన్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సాయంత్రం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.






